Road Accident : కుక్కను తప్పించబోయి.. డివైడర్ ను ఢీకొని.. ముగ్గురి మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు కుక్కను తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతులను లక్ష్మణ్, సుబ్బాయమ్మ, హేమంత్ గా పోలీసులు గుర్తించారు.
పిఠాపురం వెళుతుండగా...
ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు తిరుపతి నుంచి పిఠాపురం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.