Road Accident : ఔటర్ రింగ్ రోడ్ లో ఘోర ప్రమాదం
శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనాన్ని ఓ కారు ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐటీ ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రకాశం జిల్లాకు చెందిన...
ప్రకాశం జిల్లాకు చెందిన దేవరపల్లి అశోక్ కుమార్ కుటుంబంతో కలిసి కారు లో దసరా పండగకు వెళ్తున్నారు. ఉదయం 6 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అశోక్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన సోదరుడు ఉదయ్ భాస్కర్‌రెడ్డి, ఐదేళ్ల కుమార్తె గాయపడ్డారు. వీరిని శంషాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.