Road Accident : మృత్యువు ఏ రూపంలోనైనా రావచ్చనడానికి?
హైదరబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
హైదరబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ మార్చడానికి వెళితే మరో కారు ఢీకొట్టి మృత్యువుకు కారణమయింది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్గు రొడ్డు పై టయోటో కారు బీభత్సం సృష్టించడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
టైరు మారుస్తుండగా...
హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయిన కారు టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ ను టయోటో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాలి లో ఎగిరి డ్రైవర్ శివ కేశవ అక్కడికక్కడే మృతి. మరోకరికి తీవ్ర గాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.