Road Accident : తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ప్రయివేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ప్రయివేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.యాచారం తమ్మలోని గూడెం వద్ద ఈ ఘటన జరిగింది. కారును ప్రయివేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
మృతులు వీరే...
మృతులు సాయితేజ, పవన్ కుమార్, రాఘవేంద్రలుగా గుర్తించారు. ఏడుగురు నగరానికి చెందిన వైజాగ్ కాలనీ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారని తెలిసింది. దీనికి సంబంధించి పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.