Road Accident : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించినట్లు తెలిసింది.

Update: 2025-02-15 03:34 GMT

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించినట్లు తెలిసింది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు వెళ్లి వస్తున్న వాహనం ప్రమాదానికి గురయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో పందొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

బొలేరో వాహనం...
బొలేరో వాహనం ప్రమాదానికి గురయింది. మీర్జాపూర్ - ప్రయాగ్ రాజ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులు ఛత్తీస్ గఢ్ వాసులుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News