Murder Case : ఎంత పెద్ద స్కెచ్ వేశారు... ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లో దేశముదుర్లే

గద్వాల్ కు చెందిన తేజశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రేమికులే హంతకులని తేలింది

Update: 2025-06-25 04:21 GMT

పెళ్లికి ముందే వివాహేతర సంబంధం ఉంటే పెద్దలను ఒప్పించడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆ తర్వాత తాళికట్టిన భర్తను హతమార్చడం ఎందుకు? హత్య చేస్తే ఎవరికి తెలియదని కనులు మూసుకుని పోయి వ్యవహరిస్తున్న జంటలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషాయాల వెలుగు చూస్తే.. ఇప్పుడు తెలంగాణ, ఏపీకి చెందిన ప్రేమికులు ఒక హత్యకు కారణమయ్యారు. గద్వాల్ కు చెందిన తేజశ్వర్ ఒక ప్రయివేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. అయితే తేజశ్వర్ తో ఐశ్వర్యకు పెద్దలు వివాహాన్ని నిర్ణయించారు. ఇద్దరిదీ మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ కావడంతో పెళ్లి ఘనంగా నిర్వహించారు.

కర్నూలుకు చెందిన తిరుమలరావు...
అయితే ఐశ్వర్య తన పెళ్లికి ముందే కర్నూలుకు చెందిన బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుతో పరిచయం ఏర్పడింది. తిరుమలరావుకు అప్పటికే పెళ్లికావడం, కాని పిల్లలు లేకపోవడంతో తన భార్యనుచంపాలని మొదట అనుకుని తర్వాత ఆ ఆలోచన మానుకున్నాడు. ఐశ్వర్య ద్వారా తాను పిల్లల్ని కనాలని భావించాడు. ఇందుకోసం పెళ్లి అయిన తర్వాత కర్నూలులో కాపురం పెట్టాలని తేజేశ్వర్ ను కోరాగా అందుకు నిరాకరించాడు. దీంతో తేజేశ్వర్ ను అడ్డు తొలగించుకోవడానికి తిరుమలరావు, ఐశర్య భారీగా స్కెచ్ వేశారు. తేజేశ్వర్ ను చంపేసి తాము విదేశాలకు జంప్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. హత్య చేసిన వెంటనే మృతదేహం లభ్యం కాకముందే తాము లడాఖ్ కు వెళ్లి అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేశారు.
విదేశాలకు చెక్కేయాలని...
ఇందుకోసం సుపారీ గ్యాంగ్ ను సంప్రదించారు. తేజేశ్వర్ ను హత్య చేయడానికి రెండు లక్షల రూపాయలుచెల్లించాడు. తిరుమలరావు తాను పనిచేస్తున్న బ్యాంకు నుంచి డబ్బులు కొంత రుణం రూపంలో, మరికొంత అక్రమ పద్ధతిలో తీసుకున్నాడని తెలిసింది. తేజేశ్వర్ హత్య జరగడానికి ముందే విమానటిక్కెట్లు సిద్ధం చేసుకున్నారు. తాము విదేశాలకు వెళ్లి కొంత సెటిల్ అయ్యేంత వరకూ బతకడానికి ఇరవై లక్షల రూపాయలను సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 17న తేజేశ్వర్ ను చంపిన సుపారీ గ్యాంగ్ కర్నూలులోని రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రాంతంలో పూడ్చిపెట్టాలని భావించినా తర్వాత ఆ ఆలోచన మానుకుని పాణ్యంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. తేజేశ్వర్ కనిపించడం లేదని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఐశ్యర్యను అదుపులోకి తీసుకున్నారు. తిరుమలరావు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే అందుతున్న సమాచారం మేరకు తిరుమలరావును పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరి పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


Tags:    

Similar News