Telangana : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు

Update: 2025-10-23 06:08 GMT

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ స్టేజ్ సమీపంలో స్కూటీని ఒక వాహనం ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు. అయితే స్కూటీని ఢీకొట్టిన వాహనం ఏదన్నది మాత్రం తెలియరాలేదు. సమీపంలోని సీసీ టీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

స్కూటీపై వస్తుండగా...
ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు వికారాబాద్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడాలకు చెందిన స్నేహితులు సల్మాన్, వడ్ల రవిగా గుర్తించారు. దీపావళి పండగకు ఊరికెళ్లి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News