Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు

Update: 2025-10-21 06:06 GMT

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. గంగాధర మండలం పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. టూ వీలర్ ను ఢీకొట్టిన కారు తర్వాత చెట్టును ఢీకొట్టడంతో కారులో ఉన్న డ్రైవర్ తో పాటు ద్విచక్ర వాహనదారుడు కూడా మృతి చెందాడు. కరీంనగర్ - జగిత్యాల రహదారిపై అత్యంత వేగంగా వెళుతున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

కారు డ్రైవర్ తో పాటు...
అయితే ద్విచక్రవాహనం ఢీకొన్న తర్వాత కారు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో కారు డ్రైవర్ కూడా మరణించాడని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ మల్లయ్య కొండన్నపాలెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ద్విచక్రవాహనదారుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News