Road Accident : హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్డు వద్ద రావిరాల సమీపంలో కారు బీభత్సం సృష్టించింది

Update: 2025-03-06 12:16 GMT

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్డు వద్ద రావిరాల సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ వద్ద మొక్కలకు నీళ్లు పోస్తున్న వాహనాన్ని కారు ఢీకొట్టడంతో కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. దీంతో పాటు కారులో ఉన్న ఇద్దరు మరణించారు. అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

అతి వేగమే...
అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ఉన్న వారు ఎవరో కూడా తెలియరాలేదు. పోలీసులు అక్కడకు చేరుకుని కారులో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పో్స్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే పనిలో ఉన్నారు.


Tags:    

Similar News