ఘోర రోడ్డు ప్రమాదం... 42 మంది సజీవ దహనం
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమదంలో 42 మంది సజీవ దహనమయినట్లు సమాచారం
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 42 మంది సజీవ దహనమయినట్లు సమాచారం. అయితే ఇందులో ఎక్కువ మంది భారతీయులు కాగా అందులో హైదరాబాద్ కుచెందిన వారు కూడా ఉన్నారని తెలిసింది. మక్కా నుంచి మదీనాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
హైదరాబాద్ కు చెందిన...
యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు మొత్తం దహనమవ్వగా అందులో ప్రయాణికులందరూ చనిపోయారు. మృతుల్లో దాదాపు ఇరవై మంది మహిళలు, పదకొండు మంది చిన్నారులు కూడా ఉన్నారని సమాచారం. సహాయక చర్యలను ప్రారంభించారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.