రోడ్డు పక్కన నిల్చున్న మహిళలపైకి దూసుకొచ్చిన కారు
చిత్తూరు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నుంచున్న ముగ్గురు మహిళల పైకి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది
చిత్తూరు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నుంచున్న ముగ్గురు మహిళల పైకి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గోవిందపల్లికి చెందిన వెంకటమ్మ అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమార్లో రికార్డు అయ్యాయి.
మహిళ మృతి...
అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన మహిళలు ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో వచ్చి రోడ్డు పక్కన నించున్న వారిని ఢీకొట్టాడా? లేక నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.