Road Accident : బైక్ వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

Update: 2025-05-16 04:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైవేపై బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులను లారీ ఢీకొట్టింది. లారీకి ఎదురుగా వెళ్లడంతో బైక్ యువకులను నియంత్రించలేకపోయారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

మృతులు ఇద్దరూ...
మృతి చెందిన వారు వెంకట్రావు, గొర్లె సురేశ్ గా పోలీసులు గుర్తించారు. అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తు కూడా ప్రమాదానికి ఒక కారణమని అంటున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బైక్ నెంబరు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News