Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం .. 9 మంది మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడక్కికక్కడే మరణించారు

Update: 2025-07-14 01:49 GMT

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడక్కికక్కడే మరణించారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఈ ఘటన జరిగింది. మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ బోల్తాపడటంతోఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా, పన్నెండు మంది గాయపడ్డారు. రాజంపేట్ మండలం ఇసుకపల్లి గ్రామ పరిసరాల తోటల నుంచి మామిడికాయలు కోసేందుకు కూలీలు వెళ్లే లారీ బోల్తా పడింది

మృతులంతా...
రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలని, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వద్దివేడు, కల్వకుంట్ల ప్రాంతాలకు చెందిన దాదాపు ఇరవై ఒక్క మంది కూలీలు ఇక్కడకు వచ్చారు. అయితే తోటలో మామిడి పండ్లను కోసిన తర్వాత అదే మామిడిలోడుతో వెళుతున్న లారీపై కూర్చుని రైల్వే కోడూరు మార్కెట్ కు వెళుతున్నాు. లారీ దారి మధ్యలో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడిక్కడే మరణించారు. ఇందులో చిట్టెమ్మ, సుబ్బరత్నమ్మ, గజ్జల దుర్గయ్య, గజ్జల శ్రీను, గజ్జల లక్ష్మీదేవి, రాధ, గజజ్జల రమణ, వెంకట సుబ్బమ్మ అక్కడికక్కడే మరణించారు.
గాయపడిన వారిని...
మునిచంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడిన వారందరినీ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు పన్నెండు మందికి తీవ్ర గాయాలు కావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. అతివేగం కారణంగానే లారీ అదుపు తప్పిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. మృతదేహాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజంపేట ఆసుపత్రి బంధువుల ఆర్తనాదాలతో విషాదంగా మారింది.


Tags:    

Similar News