Road Accident : రాయచోటి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. రాయచోటి మదనపల్లి మార్గంలోని, ఇస్తిమా మైదానానికి సమీపన ఉన్న శ్రీనివాసపురం వద్ద లారీ - ఇన్నోవా ఎదురెదురు ఢీకొన్నాయి.
అతి వేగమే...
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరన్నది తెలియాల్సి ఉంది.