Road Accident : నేపాల్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ల మృతి
నేపాల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ నేపాల్ లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు.
Road accident in gannavaram
నేపాల్ లో రోడ్డు ప్రమాదం సంభవించింది. దక్షిణ నేపాల్ లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన తమన్నా షేక్, ఇర్ఫాన్ ఆలంలు మరణించినట్లు తెలిపారు. ఈస్ట్ వెస్ట్ హైవే వెంట చంద్రనిగహ్‌పూర్ స్ట్రెచ్ రోడ్డు ప్రాంతంలో లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
లోయలో పడి...
వీళ్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడటంతో ఇద్దరు భారతీయులు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బీర్‌గంజ్‌లోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లోయలోపడిన వాహనాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణంగా పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.