Road Accident : దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 18 మంది స్పాట్ డెడ్

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మరణించారు

Update: 2025-11-03 01:56 GMT

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మరణించారు. ఫలోడి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ జోధ్ పూర్ కు చెందిన వారిగా గుర్తించారు. వీరు జోధ్ పూర్, సుర్ సాగర్ నుంచి బయలుదేరి కొలాయత్ పట్టణంలో దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వీరి వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్కువ మంది మహిళలు మరణించారని తెలిసింది.

మృతులందరూ....
ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. కానీ అప్పటికే పద్దెనిమిది మంది చనిపోయారు. ముగ్గురు గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనతో ఆ గ్రామాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News