Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణలోని భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది

Update: 2025-11-21 05:36 GMT

తెలంగాణలోని భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామం వద్ద ఈరోజు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును అతి వేగంతో టాటా ఏసీ వాహనం ఢీ కొట్టింది ఈ ఘటనలో పలు వురికి తీవ్ర గాయాలయ్యా యి. స్థానికుల కథనం ప్రకారం కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నుంచి వస్తున్న టాటా ఏస్ వాహనం నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది దీంతో ప్రయాణి కులకు తీవ్ర గాయాలు అయ్యాయి, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఘటనకు చేరుకున్న...
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అశ్వరావుపేట-- ఖమ్మం ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు ధ్వంసమైన వాహనాలను క్రేన్ సహా యంతో తొలగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాల ను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News