గురుమూర్తి అతి క్రూరంగా వ్యవహరించడమే కాకుండా?

జిల్లెలగూడలోని మహిళ మాధవి హత్య కేసులో గురుమూర్తి అతి క్రూరంగా ప్రవర్తించారని రాచకొండ పోలీస్ కమిషనర్ తెలిపారు.

Update: 2025-01-28 12:04 GMT

జిల్లెలగూడలోని వివాహిత మాధవి హత్య కేసులో గురుమూర్తి అతి క్రూరంగా ప్రవర్తించారని రాచకొండ పోలీస్ కమిషనర్ తెలిపారు. భార్యను చంపాననన్న పశ్చాత్తాపం అతనిలో కనిపించడం లేదన్నారు. హత్యను అతి కిరాతకంగా చేసిన తర్వాత గురుమూర్తి బంధువులను, పోలీసులను మిస్ లీడ్ చేయడానికి ప్రయత్నించారని సీపీ తెలిపారు.ఈ నెల 15, 16 తేదీల్లో మాధవి, గురుమూర్తి మధ్య గొడవ జరిగిందని, అనంతరం భార్యను తలపై కొట్టి గురుమూర్తి చంపాడని తెలిపారు. ఈ హత్యకు సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశామని తెలిపారు.

మాధవితో గొడవ పెట్టుకుని...
ఉద్దేశ్యపూర్వకంగానే మాధవితో గురుమూర్తి గొడవ పెట్టుకుని ఉంటాడని, తర్వాత హత్యచేసిన ఆనవాళ్లు దొరకకుండా చేసేందుకు అతి క్రూరంగా గురుమూర్తి వ్యవహరించారన్నారు. చుట్టుపక్కల వారికికూడా అనుమానం రాకుండా వ్యవహరించారని, అయితే పోలీసులు గురుమూర్తిపై అనుమానంతో అన్ని రకాలుగా ప్రశ్నించి, శోధించి అతనినే నిందితుడిగా నిర్ధారించామని తెలిపారు. గురుమూర్తి హత్యకు సంబంధించి ఆధారాలను తొలగించాలని ప్రయత్నించినా, పోలీసుల విచారణలో కొన్ని చోట్ల దొరికిపోయాడని రాచకొండ సీపీ తెలిపారు.


Tags:    

Similar News