బ్యాంకు స్కామ్ లో పురోగతి.. ఆ మహిళ కీలకం

మహేష్ బ్యాంకు హ్యాకింగ్ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు

Update: 2022-01-29 03:00 GMT

మహేష్ బ్యాంకు హ్యాకింగ్ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. బ్యాంకు నుంచి సైబర్ నేరగాళ్లు దాదాపు పన్నెండు కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. ముంబయి నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో ఈ నేరం ఎలా జరిగిందన్న దానిపై విశ్లేషణ చేస్తున్నారు. ప్రాక్సీ ఐపీ అడ్రస్ లను వినియోగించి సర్వర్ లోకి నేరగాళ్లు ఎంటర్ అయ్యారని ఒక నిర్ణయానికి వచ్చారు.

ప్రత్యేక బృందాలు....
పన్నెండు కోట్లను నేరగాళ్లు వివిధ అకౌంట్లకు బదిలీ చేశారు. బదిలీ అయిన వాటిలో మూడు కరెంట్ అకౌంట్లకు సంబంధించి ఆరా తీశారు. అయితే వీరికి సైబర్ నేరగాళ్లతో సంబంధం ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో కీలక భూమిక పోషించిందని అనుమానిస్తున్న షానాజ్ బేగం కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆమె దొరికితే కాని పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడి కావు. ప్రతి లావాదేవీకి సంబంధించి ఓటీపీ షానాజ్ బేగం కు చేరింది. దీంతో ఆమె ఈ కేసులో కీలకంగా మారింది. అయితే ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి. ఈ డబ్బు మొత్తం నాలుగు అకౌంట్ల నుంచి ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లోని 129 ఖాతాల్లోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News