Uttar Pradesh : దిశాపటాని ఇంటివద్ద కాల్పుల ఘటన : ఇద్దరు నిందితుల ఎన్ కౌంటర్

ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటివద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

Update: 2025-09-18 01:45 GMT

ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటివద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలిలోని ఆమె నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. కాల్పులకు తెగబడిన వారిని ఖచ్చితంగా పట్టుకుని తీరతామన్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ చెప్పినట్లుగానే ఆ మరుసటి రోజు ఎన్ కౌంటర్ జరగడం విశేషం. ఇద్దరు నిందితులను ఢిల్లీలో ఎన్ కౌంటర్ చేశారు.

ఢిల్లీలో ఉండగా...
ఢిల్లీలోని శివారు ప్రాంతంలోని ఘజియాబాద్ ట్రోనికా సిటీలో పోలీసులు కాల్చి చంపారు. నిందితులను రవీంద్ర, అరుణ్ లుగా గుర్తించిన ఉత్తర్ ప్రదేశ్ టాస్క్ ఫోర్సు పోలీసులు గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఉత్తర్ ప్రదేశ్ టాస్క్ ఫోర్స్ తో పాటు ఢిల్లీ పోలీసులు కూడా పాల్గొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో వారిద్దరు పోలీసులు కాల్పులకు ప్రయత్నించడంతో పోలీసులు కూడా కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారరు. కాల్పుల్లో నిందితులకు తీవ్ర గాయాలయ్యయి. వెంటనే వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితులిద్దరూ మృతి చెందారని వైద్యులు తెలిపారు. వారి వద్ద నుంచి బుల్లెట్లు, రైఫిల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News