వివాహేతర సంబంధంతో వ్యక్తి హత్య
రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ మండలంలో మహేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు
రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ మండలంలో మహేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మహేష్ ను హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. నిందితుడు బాపురం రత్నం ను పోలీసులు అరెస్ట్ చేశార. కట్టుకున్న భర్తతో విభేదాలు రావడంతో బోరబండకు చెందిన బాపురం రత్నం అనే యువకుడితో ప్రేమాయణం సాగించిన వివాహిత మహిళ నాగలక్ష్మి అలియాస్ మేఘన ప్రియుడు రత్నం ను పక్కనపెట్టిమొయినాబాద్ మండలం లోని వెంకటాపూర్ ప్రాంతానికి చెందిన బార్బర్ మహేష్ తో సైతం వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అడ్డుతొలిగించుకోవాలని...
మహేష్ పరిచయం కావడంతో గత కొన్ని రోజులుగా మొదటి ప్రియుడు రత్నం ను దూరంగా పెట్టింది. తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని పథకం ప్రకారం డిసెంబర్ 24న పథకం ప్రకారం కవేలి గూడ వద్ద గొడ్డలితో నరికి బార్బర్ మహేష్ ను రత్నం హత్య చేశాడు. నాగలక్ష్మిని అదుపులోకి తీసుకొని విచారించడంతో గుట్టు రట్టయింది. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడు రత్నం ను బోరబండలో అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.