Andhra Pradesh : ఈ గ్యాంగ్ ఐదుగురు ప్రాణాలను తీసేసింది.. ప్రమాదం తర్వాత కూడా?

గణపవరం బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమై ఐదుగురు యువకుల మృతికి కారణమైన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2025-12-13 05:10 GMT

ఆంధ్ర్రప్రదేశ్ లోని గణపవరం బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమై ఐదుగురు యువకుల మృతికి కారణమైన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లారీని బలవంతంగా ఆపి డబ్బులు దోచుకునే ప్రయత్నంలో ఈ విషాదం చోటు చేసుకుందని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. చిలకలూరిపేట నాదెండ్ల మండలం గణపవరం గ్రామం పరిధిలోని జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందడానికి, ఒకరు గాయపడడానికి కారణమైన ఐదుగురు నిందితులను నరసరావుపేట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాకచక్యంగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ విషాదకర సంఘటన డిసెంబర్ నాలుగో తేదీన జరిగింది.

వాహనాలను ఆపి...
బోయపాలెం నుండి వస్తున్న నిందితులు కారులో హైవేపై వెళ్లే వాహనాలను ఆపి, డ్రైవర్లను కొట్టి డబ్బులు దోచుకోవాలని నిర్ణయించుకున్నారు.నిందితులు తమ కారుతో, మహేంద్ర ట్రాక్టర్ల లోడుతో ఒంగోలు వైపు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేసి ఆపమని డ్రైవర్‌కు సైగ చేశారు. లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేసి, లారీని రోడ్డుకు ఎడమ వైపునకు పోనిస్తున్న క్రమంలో, లారీ వెనుక వేగంగా వస్తున్న మృతి చెందిన వారు ప్రయాణిస్తున్న కారు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదుగురు మరణింొచారు.
ప్రమాదం అనంతరం కూడా...
ప్రమాదం అనంతరం కూడా నిందితులు లారీ డ్రైవర్‌ను కూడా బెదిరించినట్లు నరసారావుపేట పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై నాదెండ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ముద్దాయిలను గుర్తించి ఈ నెల 12వ తేదీన నాదెండ్ల పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వారు ఉపయోగించిన కారు తో పాటు మరియు వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారిపై వస్తున్న లారీ డ్రైవర్లను బెదిరించుకుని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటువంటి గ్యాంగ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News