చైతన్యానంద స్వామీ జీ అరెస్ట్.. రెండు ఫేక్ ఐడీ కార్డులు స్వాధీనం

ఢిల్లీలోని ఆశ్రమంలో విద్యార్థినులను వేధించిన చైతన్యానంద స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2025-09-28 05:11 GMT

ఢిల్లీలోని ఆశ్రమంలో విద్యార్థినులను వేధించిన చైతన్యానంద స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు పదిహేడు మంది విద్యార్థినులపై చైతన్యానంద స్వామి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయగానే ఆయన పరారయ్యారు. శ్రీశారద ఇనిస్టిట్యూట్ఆఫ్ ఇండియన్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ గా ఉన్న చైతన్యానంద స్వామి బాగోతాలు బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

నేడు కోర్టులో హాజరు పర్చనున్న...
ఈ సందర్భంగా చైతన్యానంద స్వామి నుంచి రెండు ఫేక్ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు చైతన్యానంద స్వామిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. మరొకవైపు చైతన్యానంద స్వామిని కస్టడీకి కోరేందుకు అవకాశాలున్నాయి. ఆయన నుంచి అనేక విషయాలను రాబట్టాల్సిన అవసరం ఉందని, కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానం పిటీషన్ వేయనున్నారు.


Tags:    

Similar News