Nellore : రౌడీషీటర్ శ్రీకాంత్ గ్యాంగ్ అరెస్ట్ చేసేందుకు ఆపరేషన్ షురూ.. జిల్లాను వదిలేసిన రౌడీషీటర్లు

నెల్లూరులో రౌడీషీటర్ శ్రీకాంత్, అరుణ గ్యాంగ్ లను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు

Update: 2025-08-23 04:10 GMT

నెల్లూరులో రౌడీషీటర్ శ్రీకాంత్, అరుణ గ్యాంగ్ లను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గత కొంతకాలంగా రౌడీషీటర్ శ్రీకాంత్ చేసిన అరాచకాలకు ఎవరెవరు సహకరించారన్న దానిపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. శ్రీకాంత్ కొందరు రాజకీయ నేతల అండతో పెరోల్ సంపాదించుకుని బయటకు వచ్చి కూడా తన కార్యకలాపాలను కొనసాగించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎవరెవరు శ్రీకాంత్ కు సహకరించారన్న దానిపై తనకు నివేదిక అందివ్వాలని చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. కేవలం రాజకీయ నేతలే కాకుండా పోలీసు అధికారుల సహకారంపై కూడా ఆరా తీయాలని ఆదేశించడంతో పోలీసులు ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు.

గ్యాంగ్ ను అదుపులో తీసుకునేందుకు...
మరొకవైపు శ్రీకాంత్, అరుణ గ్యాంగ్ లను అదుపులోకి తీసుకునేందుకు నెల్లూరు జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వీరి గ్యాంగ్ లో ఉన్న రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే నెల్లూరు వేదాయపాలెం సమీపంలో కొందరిని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. కొందరు రౌడీషీటర్లు తమిళనాడుకు పారిపోయారని సమాచారం. అరుణ గ్యాంగ్ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హత్యలు, బెదిరింపులు, నేరాలు,రౌడీ గ్యాంగ్ లతో ఎదిగిన రౌడీ షీటర్ శ్రీకాంత్,అరుణ ల గ్యాంగ్ పై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుక సిద్ధం కావడంతో కొందరు జిల్లా నుంచి పరారయినట్లు తెలిసింది.
జైలులో ఉంటూనే...
శ్రీకాంత్ అరెస్టయి నెల్లూరు జైలులో ఉంటూనే జైలును నేరాలకు అడ్డగా చేసుకుని మర్డర్స్,సెటిల్మెంట్ లు చేస్తుండటంతో విశాఖ జైల్ కు రౌడీ షీటర్ శ్రీకాంత్ తరలించారు. అయితే శ్రీకాంత్ నెలకు లక్షలు ఖర్చు చేసి నెల్లురు జైల్ అధికారులను,సిబ్బందిని,ఎస్కార్ట్ పోలీసులను మేనేజ్ చేసి సుపారీ హత్యలు చేస్తున్నట్లు పోలీసులు ప్రాధమికంగా విచారణలో గుర్తించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ అరాచకాలను అణిచివేసేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు సింహపురి పోలీసులు. చట్టం లోని లొసుగులతో లక్షలు ఖర్చు చేసి కోర్టుల ద్వార తిరిగి నెల్లూరు జైలు కి రావాలని రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కూడా గుర్తించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్,క్రిమినల్ అరుణ ల బాధితులు చాల మంది ఫిర్యాదుకు ముందుకు వస్తున్ననేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసే అవకాశముంది.


Tags:    

Similar News