Hyderbad : భారీ వర్షానికి హైదరాబాద్ లో ముగ్గురు బలి

హైదరాబాద్ లో భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న భారీ వర్షానికి హైదరాబాద్ లో ముగ్గురు మరణించారు

Update: 2025-09-15 04:11 GMT

హైదరాబాద్ లో భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న భారీ వర్షానికి హైదరాబాద్ లో ముగ్గురు మరణించారు. అయితే ఆసిఫ్ నగర్ అప్జల్ సాగర్ మంగారుబస్తీ వద్ద విషాదం చోటు చేసుకుంది. నాలాలో పడి ఇద్దరు కొట్టుకుపోయారు. అప్జల్ సాగర్ నాలాను దాటే సమయంలో అదుపు తప్పి అందులో కొట్టుకుపోయారు. తప్పిపోయిన వారిద్దరూ మామ, అల్లుళ్లని చెబుతున్నారు.

తప్పిపోయిన వారి కోసం...
తప్పిపోయిన వారి కోసం హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ముషీరాబాద్ లోనూ మరొక వ్యక్తి మరణించారని చెబుతున్నారు. నిన్న రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నాలాలు నిండిపోయాయి. ఎక్కడ కాల్వ ఉందో తెలుసుకోలేని పరిస్థితుల్లో రహదారులపై నీరు నిండటంతో ముగ్గురు మరణించారు. వీరి కోసం వెదుకుతున్నారు.


Tags:    

Similar News