Road Accident : పాలెం ఘటనను తలపిస్తూ... ఎన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నా?

ప్రయివేటు బస్సు లు ప్రమాదానికి గురైన ఘటనలు అనేకం ఉన్నాయి

Update: 2025-10-24 03:42 GMT

ప్రయివేటు బస్సు లు ప్రమాదానికి గురైన ఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో ఎన్ని ఘటనలు జరిగినా ప్రయివేటు బస్సుల యాజమాన్యాలు సరైన చర్యలు తీసుకోవడం లేదు. వోల్వో బస్సు కావడంతో మంటలు సులువుగా వ్యాపిస్తాయి. స్లీపర్ బస్సు కావడంతో అందరూ నిద్రలో ఉంటారు. ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. కిందకు దిగి తమను తాము రక్షించుకునేంత సమయం కూడా ఉండదు. అందులోనూ బస్సులో ఎక్కువ భాగం ప్లాస్టిక్ , దూది వంటి వాటితో నిండి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తం క్షణాల్లో దగ్దమవుతాయని తెలిపారు.

పాలెం సమీపంలో...
ఆంధ్రప్రదేశ్‌లోని పాలెం సమీపంలో 2014 అక్టోబర్ 29న బస్సు ప్రమాదానికి గురైయింది. ఇధి ఘోర ప్రమాదం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక వోల్వో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగడంతో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సులోని ఇంధన ట్యాంక్ లీక్ అవ్వడం ఈ ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది. నలభై ఐదు మంది మరణించడం అతి పెద్ద విషాదఘటన ఇలా పాలెం ఘటన మరిచిపోకముందే మరొక ఘటన కూడా జరిగింది. ఇటిక్యాల వద్ద కూడా బస్సు ప్రమాదానికి గురయింది.
ఎమెర్జెన్సీ డోర్ లు లాక్ కావడంతో...
ఎమెర్జెన్సీ డోర్ లు కూడా అంత సులువుగా తెరుచుకోవు. మృతులందరూ స్లీపర్ క్లాస్ లో పడుకున్న వారేనని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. నిబంధనలను తుంగలో తొక్కి మరీ ప్రయివేటు బస్సు యాజమాన్యం బస్సులను ఆదాయార్జన కోసమే నడుపుతుంది. కాలం చెల్లిన బస్సులను కూడా నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. డోర్ లు ఆటోమేటిక్ గా లాక్ కావడంతో మెయిన్ డోర్ తో పాటు ఎమెర్జెన్సీ డోర్ కూడా తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు సైడ్ అద్దాలు బద్దలు కొట్టి 23 మంది ప్రాణాలతో బయటపడ్డారు.


Tags:    

Similar News