Telangana : వివాహానికి ఒక్క రోజు ముందు .. బలవన్మరణం

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివాహానికి ఒక్కరోజు ముందు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు

Update: 2025-11-12 07:26 GMT

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివాహానికి ఒక్కరోజు ముందు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగళపహాడ్‌ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మంగళపహాడ్ గ్రామానికి చెందిన ప్రతాప్‌గౌడ్‌ రైతు. గురువారం ఆయన వివాహం జరగాల్సి ఉండగా, కుటుంబ సభ్యులతో వాగ్వాదం తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పెళ్లి పట్ల ఆసక్తి లేకపోవడంతో...
పెళ్లి పట్ల ఆసక్తి లేకపోవడంతో ఆవేదనకు లోనయ్యాడని, అయితే పెళ్లి చేసుకోవాలని ప్రతాప్ గౌడ్ పై కుటుంబ సభ్యులు వత్తిడి తెచ్చారని పోలీసులు తెలిపారు.కుటుంబ సభ్యులను సమాధాన పర్చలేక, మరొకవైపు పెళ్లి చేసుకోలేక ప్రతాప్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రతాప్‌గౌడ్‌ తమ్ముడు శ్రీకాంత్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Tags:    

Similar News