నిర్మలా సీతారామన్ ఫోటో 14.35 లక్షల మోసం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫొటోను డీపీగా పెట్టి దారుణంగా మోసం చేశారు.

Update: 2025-09-17 13:45 GMT

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫొటోను డీపీగా పెట్టి దారుణంగా మోసం చేశారు. ఆన్‌లైన్‌ పెట్టుబడులతో అధిక లాభాలంటూ ఓ ప్రకటనను సోషల్‌మీడియాలో ప్రచారం చేయగా, దాని పై క్లిక్‌ చేసిన వృద్ధుడు 14 లక్షల 35 వేలు పోగొట్టుకున్నాడు. 68 ఏళ్ల వృద్ధుడికి ఫేస్‌బుక్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫొటోతో తయారు చేసిన ఒక ప్రకటన కనిపించింది. అది నిజమని నమ్మిన బాధితుడు లింకును ఓపెన్‌ చేయగానే గుర్తుతెలియని వ్యక్తులు లైన్‌లోకి వచ్చారు. యూకేలోని క్వాంటం ఏఐ కంపెనీలో పెట్టుబుడులు పెట్టాలని, ఊహించని లాభాలు వస్తాయని చెప్పి దశలవారీగా 14లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టించారు. 36లక్షలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. అయితే ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రం వీలు పడలేదు. విత్‌డ్రా చేసుకోవాలంటే 8లక్షలు పన్ను చెల్లించాలని మరొకరు చెప్పారు. చివరికి మోసపోయానని గుర్తించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Tags:    

Similar News