టెస్ట్ ట్యూబ్ సెంటర్ ముసుగులో అడ్డదారులు.. అక్రమార్జనే ధ్యేయం
హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు.
వైద్యులు దేవుడితో సమానం. అలాంటి వారిలో కొందరు అక్రమార్జనకు దిగుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్ని సార్లు పోలీసులకు చిక్కినా సరే వారిలో మార్పు రావడం లేదు. హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. కేవలం కరెన్సీ నోట్ల కోసం అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారు. ఈమె నిజంగా వైద్యురాలా? లేక మరేదైనా? అన్న సందేహం కలుగుతుంది. భర్త వీర్యకణాలతో కాకుండా మరొక వ్యక్తి వీర్యకణాలతో సంతానోత్పత్తికి దిగిన నమ్రతను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నమ్రత పై గతంలోనూ అనేక కేసులు నమోదయినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. హాస్పిటల్ పేరు మార్చడం, రిజిస్ట్రేషన్ వేరే వ్యక్తిపై చేయడం, ఆసుపత్రి అడ్రస్ మార్చడం వంటివి చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పై ...
సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పై పోలీసులు కేసు నమోదు చేయడం ఇది నాలుగో సారి. డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. స్మెర్మ్ బ్యాంక్ ను కూడా ఆసుపత్రిలో మెయిన్ టెయిన్ చేస్తున్నారు. మోసాలకు పాల్పడుతున్న నమ్రతను నేడు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశముంది. ఎవరైనా సంతానం లేని వారు వస్తే భర్త వీర్య కణాన్ని సేకరించి దానిని భార్య గర్భంలోకి ప్రవేశపెట్టి బేబీకి జన్మ నిచ్చేలా చే్స్తామని నమ్మించిన నమ్రత చివరకు భర్త వీర్యకణం కాకుండా వేరే వ్యక్తి స్పెర్మ్ ను ఉపయోగించి సంతానాన్ని కలిగించారు. పుట్టిన బిడ్డకు అనారోగ్యం రావడంతో వేరే ఆసుపత్రిలో చూపించడంతో క్యాన్సర్ అని తేలింది.
ఇలా బయటపడటంతో...
దీంతో తమ కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేకపోయినా బిడ్డకు ఎలా వచ్చిందోనని అనుమానించిన వారు డీఎన్ఏ టెస్ట్ చేయగా ఆ బిడ్డ తన భర్తకు పుట్టినది కాదని తెలుసుకుని అవాక్కయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో దాడులు నిర్వహించారు. కీలక ఫైళ్యను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడే కాదు నమ్రత పై 2018, 2020లోనూ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు కూడా రెండు క్రిమినల్ కేసులు ఆమెపై ఉన్నాయి. అయినా నమ్రత తీరులో మార్పు రాకపోవడం డబ్బుల కోసం కక్కుర్తి పడి అడ్డదారులు తొక్కి సంపాదన కోసం అమ్మతనానికి మచ్చ తెచ్చే విధంగా ప్రయత్నించే నమ్రత వాళ్లను శిక్షించాలని కోరుతున్నారు.