కోమటి జయరాం హత్య కేసులో సంచలన తీర్పు

చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో 11 మందిని నిర్దోషులుగా తేల్చింది.

Update: 2023-03-06 11:59 GMT

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో 11 మందిని నిర్దోషులుగా తేల్చింది. వారందరిపై నమోదయిన కేసులను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. అయితే ఇదే కేసేులో ప్రధాన నిందితుడైన రాకేష్ రెడ్డిని మాత్రం దోషిగా తేల్చింది. రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు శిక్షను మాత్రం ఈ నెల 9వ తేదీన ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ముగ్గురు పోలీసు అధికారులను నిర్దోషులుగా తేల్చింది.

రెండున్నరేళ్ల తర్వాత...
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం 2019 జనవరి 31 వతేదీన దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. చిగురుపాటి జయరాంను హత్యచేసిన దుండగులు విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిలో నందిగామ వద్ద దుండగులు ఆయనను కారులోనే తీసుకువచ్చారు. దీనిపై వెంటనే పోలీసులు ఇందులో రాకేష్ రెడ్డి ప్రమేయం ఉందని గుర్తించి అరెస్ట్ చేశారు. రాకేష్ రెడ్డితో పాటు మరో పదకొండు మంది అనుమానితులపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ 11 మందిని నిర్దోషులుగా నాంపల్లి కోర్టు ప్రకటించింది. రాకేష్ రెడ్డికి ముగ్గురు పోలీసు అధికారులు సహకరించారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.


Tags:    

Similar News