కూకట్‌పల్లి బాలిక హత్యకేసులో వీడని మిస్టరీ

కూకట్‌పల్లి బాలిక హత్యకేసులో మిస్టరీ వీడలేదు. ఐదు రోజులు గడిచినప్పటికీ ఇంకా బాలికను హత్యచేసిందెవరన్నది తేలలేదు

Update: 2025-08-22 04:34 GMT

కూకట్‌పల్లి బాలిక హత్యకేసులో మిస్టరీ వీడలేదు. ఐదు రోజులు గడిచినప్పటికీ ఇంకా బాలికను హత్యచేసిందెవరు? కారణాలేమిటి? అన్నదానిపై పోలీసులు తేల్చలేకపోయారు. బాలిక దేహం పై పద్దెనిమిది కత్తిపోట్లు ఉండటంతో నిందితుడు పక్కా ప్లాన్ తో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఎటువంటి ఆధారాలను ఇప్పటి వరకూ సంపాదించలేకపోయారు.

ఆధారాలు లభించక...
ఐదు రోజులు గడిచినా ఇంకా నిందితుడి ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. బాలికను చంపి ఆధారాలు లేకుండా చేసిన నిందితుడు పోలీసుల కన్నగప్పేలా వ్యవహరించాడు.బాలిక తల్లిదండ్రులు, స్థానికులతో పాటు కూకట్ పల్లి పోలీసులు అనుమానితులను విచారించారు.అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు త్వరలో నిందితుడినిపట్టుకుంటామని అంటున్నారు.


Tags:    

Similar News