క్షుద్రపూజలు చేస్తున్నాడన్న అనుమానంతో హత్య

నిర్మల్ జిల్లాలో క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో యాభై ఐదేళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం కలిగించింది

Update: 2025-12-14 02:24 GMT

నిర్మల్ జిల్లాలో క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో యాభై ఐదేళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం కలిగించింది. పోలీసుల కథనం ప్రకారం... కడెం మండలం, ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని గాంధీ గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య అనే వ్యక్తిని ఈ నెల పదో తేదీ రాత్రి హత్యకు గురయ్యాడు.

అటవీ ప్రాంతంలో...
అదే గ్రామానికి చెందిన నరేష్ , అతని సోదరుడు మల్లేష్ అనే ఇద్దరు నిందితులు భీమయ్యను హత్య చేసి, సాక్ష్యాలు లేకుండా చేయడానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో అతని మృతదేహాన్ని కాల్చివేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షుద్రపూజలు చేస్తున్నాడన్న అనుమానంతోనే ఈ కిరాతకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఖానాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అజయ్, కడెం సబ్-ఇన్‌స్పెక్టర్ సాయి కిరణ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో, భీమయ్య క్షుద్రపూజలు చేస్తున్నాడని, అందుకే తాము అతన్ని చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News