చట్నీ మీద పడిందని హత్య చేసిన కిరాతకులు

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఒక యువకుడిని కిరాతకంగా హత్య చేశారు

Update: 2025-11-05 07:01 GMT

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఒక యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. రెండు గంటలపాటు కారులో తిప్పుతూ సిగరెట్లతో కాల్చుతూ చివరికి కత్తితో కిరాతకంగా హత్య చేసిన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్–నాచారం ప్రాంతంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సరదాగా కారులో తిరుగుతున్న మహమ్మద్ జునైద్, షేక్ సైఫుద్దీన్, మణికంఠ, మరో బాలుడు(16)ను, ఎల్బీ నగర్ వద్ద ఉప్పల్ ప్రాంతానికి చెందిన మురళి కృష్ణ లిఫ్ట్ అడిగాడు. కారులో ఎక్కించుకుని టిఫిన్ కు ఆగారు.

కారులో ఎక్కించుకుని...
అయితే అందరూ దారి మధ్యలో ఎన్జీఆర్ఐ ప్రాంతంలో యువకులతో కలిసి టిఫిన్ చేస్తుండగా, ఒక యువకుడిపై అనుకోకుండా చట్నీ పడింది దీంతో మురళి కృష్ణను కారులో బలవంతంగా ఎక్కించుకుని, నా మీదే చట్నీ పోస్తావా అంటూ, పిడి గుద్దులు గుద్దుతూ నరకం చూపించారు. రెండు గంటలు కారులో తిప్పుతూ, సిగరెట్లతో కాల్చుతూ, చివరికి కత్తితో మురళి కృష్ణను పొడిచారు. నిందితుల నుంచి తప్పించుకునేందుకు, కారు దూకి పారిపోతుండగా, వెంబడించి మరీ హతమార్చారు. మురళి కృష్ణ చనిపోయాడని నిర్ధారించుకుని, మార్గ మధ్యలో కత్తి పడేసి, మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ ప్రాంతంలో కారు పార్క్ చేసి పారిపోయారు. నిందితుల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని అరెస్టు చేసి పోలీసులు రిమాండుకు తరలించారు.


Tags:    

Similar News