దొంగతనమైతే చేశాడు కానీ.. స్విచ్ ఆఫ్ చేయడం మరిచాడు

గత మూడు నెలల్లో తమకు 10 మొబైల్ ఫోన్ దొంగతనం ఫిర్యాదులు వచ్చాయని.. అన్ని సందర్భాల్లో, హ్యాండ్‌సెట్‌లను కిటికీలు, తలుపుల దగ్గర ఉన్న ఛార్జింగ్

Update: 2022-07-10 06:59 GMT

బోరివలి వెస్ట్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు, మొబైల్ ఫోన్‌లను దొంగిలించి ఆపై వాటిని బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేవాడు. నాలుగేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల లిస్ట్ నుండి దూరంగా ఉన్నాడు. ఇన్ని రోజులూ అంతా సజావుగా సాగుతూ వచ్చింది.. ఇటీవల అతడు ఓ మొబైల్ ఫోన్ ను దొంగతనం చేసి.. ఆ హ్యాండ్‌సెట్‌ను ఆఫ్ చేయడం మర్చిపోయాడు. ఇంతలో అతని ఇంటికి పోలీసు బృందం చేరుకుంది..

MHB కాలనీ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ మాట్లాడుతూ, గత మూడు నెలల్లో తమకు 10 మొబైల్ ఫోన్ దొంగతనం ఫిర్యాదులు వచ్చాయని.. అన్ని సందర్భాల్లో, హ్యాండ్‌సెట్‌లను కిటికీలు, తలుపుల దగ్గర ఉన్న ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు వాటిని తీసుకెళ్లినట్లు చెప్పారు.
బోరివలి వెస్ట్‌లోని లక్ష్మణ్ భవనంలో నివాసం ఉంటున్న వికాస్ రామన్ రాయ్ (24) అనే వ్యక్తి మొబైల్ ఫోన్ కూడా ఇటీవల దొంగిలించబడింది. సోమవారం దాఖలు చేసిన తన పోలీసు ఫిర్యాదులో.. ఒక రోజు ముందు తన కిటికీ దగ్గర నుండి ₹ 16,000 విలువైన తన Vivo మొబైల్ ఫోన్ దొంగిలించబడిందని చెప్పాడు. రాయ్ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత.. IMEI నంబర్‌లను ఉపయోగించి దొంగిలించబడిన ఫోన్‌లను కనుగొనడానికి ప్రయత్నించామని కుడాల్కర్ చెప్పారు. ఆ ఫోన్‌ స్విచ్ ఆన్ చేయబడిందని, మొబైల్ టవర్ లొకేషన్ సహాయంతో మేము లక్ష్మణ్ భవనం ఎదురుగా ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు పోలీసులు.
గత నాలుగేళ్లుగా మొబైల్ చోరీలకు పాల్పడుతున్న విజయ్ సురేలా అక్కడ ఉంటున్నట్లు పోలీసు బృందం గుర్తించింది. అతని గదిని వెతికినా ఏమీ లభించలేదు. పోలీసు అధికారి సూర్యకాంత్ పవార్, రాయ్ మొబైల్ నంబర్‌కు డయల్ చేయగా.. అది రింగ్ అవుతున్నట్లు గుర్తించారు. గది మొత్తం వెతికినా ఫోన్ ఆచూకీ లభించలేదు. పవార్ ఆ నంబర్‌కు మళ్లీ కాల్ చేసాడు. పెరట్లో నుండి శబ్దం వినిపించిందని సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ చెప్పారు. బురద ఉన్న ప్రాంతానికి చేరుకుని నేలను కొంత తవ్వారు. అప్పుడు ప్లాస్టిక్ కవర్‌లో చుట్టబడిన పార్శిల్‌ను కనుగొన్నారు. అందులో 10 మొబైల్ ఫోన్‌లను గుర్తించారు. కేవలం ఒక్క ఫోన్ స్విచ్ ఆన్ లో ఉండడంతో మొత్తం బండారం బయటపడింది. విజయ్ సురేలా హ్యాండ్‌సెట్‌లను విక్రయించాలని ప్లాన్ చేసి.. ప్యాకేజీ లోతుగా పాతిపెట్టబడలేదు. అతన్ని వెంటనే అరెస్టు చేశారు. సురేలాను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా, నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు.


Tags:    

Similar News