రక్షణ కరువు.. నగ్నంగా ఇంటికెళ్లిన అత్యాచార బాధితురాలు

వివరాల్లోకి వెళ్తే.. మొరాదాబాద్ జిల్లా భోజ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 15 ఏళ్ల బాలిక.. సెప్టెంబర్​ 1వ తేదీన పక్క గ్రామంలో జరుగుతున్న..

Update: 2022-09-22 13:08 GMT

యూపీలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ముక్కుపచ్చలారని పిల్లల నుంచి పండు ముసలి వరకూ ఎవర్నీ వదలట్లేదు మృగాళ్లు. రోడ్డుపైనే కాదు.. ఇంట్లో ఆడపిల్ల ఒంటరిగా కనిపించడమే పాపమైపోయింది. ఇటీవల అక్కడ దళిత మైనర్ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీసిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన సోషల్ మీడియా ద్వారా వెలుగులోకొచ్చింది. సామూహిత అత్యాచారానికి గురైన బాలిక.. స్పృహలోకి వచ్చాక రోడ్డుపై నగ్నంగా.. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి చేరుకోవడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. మొరాదాబాద్ జిల్లా భోజ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 15 ఏళ్ల బాలిక.. సెప్టెంబర్​ 1వ తేదీన పక్క గ్రామంలో జరుగుతున్న సంత చూడడానికి వెళ్లింది. బాలిక తిరిగి ఇంటికి వస్తుండగా నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి.. నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. బాలికను వివస్త్రను చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలిక స్పృహ కోల్పోగా.. నిందితులు పరారయ్యారు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన బాలిక నగ్నంగానే ఇంటికి వెళ్లింది. అలా వెళ్తున్న బాలికకు దుస్తులిచ్చి ఆదుకోవాల్సిందిపోయి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ అయి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసే విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు, కుటుంబంతో కలిసి పోలీస్ స్టేషన్​కు వెళ్లి, ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయలేదని కొందరు అంటున్నారు. వారంరోజుల తర్వాత ఎస్​ఎస్​పీ హేమంత్​ కుటియాల్​ను కలవగా.. అప్పుడు కేసు పెట్టారని మరికొందరు చెప్తున్నారు. తన మేనకోడలిపై అత్యాచారం జరిగిందని ఓ వ్యక్తి సెప్టెంబర్ 7న ఫిర్యాదు చేశాడని మేము దర్యాప్తు ప్రారంభించాం కానీ.. అలాంటిదేమీ లేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారని మొరాదాబాద్ ఎస్​పీ సందీప్ కుమార్ మీనా తెలిపారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News