Murder : చికెన్ పకోడి కోసం హత్య.. మామూలోడు కాదండి
చికెన్ పకోడీ కోసం ఏకంగా ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
చికెన్ పకోడీ కోసం ఏకంగా ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మద్యం మత్తులో ఒకరి ప్రాణం తీశాడు. పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వనపలో మిన్నారావు అనే యువకుడు ఫుల్లుగా తాగేసి పక్కనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లి తనకు చికెన్ పకోడి కావాలని కోరారు. కానీ ఫుడ్ సెంటర్ యజమాని శంకర్ చికెన్ పకోడి లేదని తెలిపాడు. అయినా సరే మిన్నారావు తనకు చికెన్ పకోడి కావాల్సిందేనని పట్టుబట్టాడు. లేదని చెబుతున్నా వినవేంటి అంటూ కసురుకున్నాడు.
మద్యం మత్తులో...
దీంతో మద్యంమత్తులో ఉన్న మిన్నారావుకు కోపం వచ్చింది. కోపంతో ఊగిపోతూ శంకర్ పై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న సుత్తిని తీసుకుని శంకర్ తలపై కొట్టాడు. దీంతో కింద పడిపోయిన శంకర్ ను కత్తి తీసుకుని గొంతు కోశాడు. దీంతో శంకర్ చనిపోయాడు. తర్వాత మృతదేహాన్ని కాల్వలో పడేసి వెళ్లిపోయాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు మిన్నారావు కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.