కర్రెగుట్ట అడవుల్లో భారీ ఎన్ కౌంటర్

తెలంగాణ - చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టుల మృతి చెందినట్లు సమాచారం.

Update: 2025-04-24 06:24 GMT

తెలంగాణ - చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టుల మృతి చెందినట్లు సమాచారం. భద్రతా బలగాలుచ మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. - భీమారంపాడు గ్రామస్తులు ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలను భద్రతాదళాలు చేశాయి. ములుగు అటవీ ప్రాంతంలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు, మావోయిస్టులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్నారు. కర్రెగుట్ట అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకునే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.

గత రెండు రోజుల నుంచి...
అటవీ ప్రాంతం చుట్టూ హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలను భద్రతాదళాలకు అందిస్తున్నారు. కర్రగుట్ట అడవులను చుట్టు ముట్టిన భద్రత వలయాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. హిడ్మా కర్ర గుట్టలో ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో దాడులు చేస్తున్నారు. దాదాపు రెండున్న వేల ది మావోయిస్టులు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో గత రెండు రోజులుగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది.


Tags:    

Similar News