రియాక్టర్ పేలి ఇరవై మంది కార్మికుల గాయాలు

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఘోర ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది

Update: 2025-06-30 05:40 GMT

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఘోర ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. దీంతో పెద్దయెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇరవై మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి కార్మికులు వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు.

మంటలను అదుపులోకి తెచ్చిన...
స్థానికుల సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పేలుడు ధాటికి రియాక్టర్ ఉన్న భవనం కూలిపోయింది. మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకు వచ్చారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


Tags:    

Similar News