Andhra Pradesh Accident : ఏపీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఇప్పటి వరకూ నాలుగు మృతదేహాలను మాత్రమే వెలికి తీశారు. బండరాళ్ల కింద చిక్కుకున్న మరో ఇద్దరి కార్మికుల మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పదిమందికి గాయాలు...
ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం పదహారుమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన పది మంది కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిని నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. బల్లికురవ క్వారీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. క్వారీ ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్వారీ ప్రమాదంపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. క్వారీ ప్రమాద ఘటనపై విచారణ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.