Hyderabad : జూబ్లీహిల్స్ లో దోపిడీకి యత్నం
జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి దోపిడీ యత్నం జరిగింది.
జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి దోపిడీ యత్నం జరిగింది. అయితే పోలీసులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. అజయ్ అగర్వాల్ ఇంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ ఇంటిలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న వాచ్‌మన్ రాధా చంద్ ఐదుగురితో కలిసి దోపిడీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి గ్యాంగ్ కత్తులు, తాళ్లతో అక్కడికి చేరుకుంది. ముందుగా డ్రైవర్‌పై దాడి చేశారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేశారు.
పోలీసులు వచ్చి...
భయపడిన కుటుంబ సభ్యులు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలర్ట్ అయిన పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకున్నారు.దోపిడీ యత్నంలో పాల్గొన్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్లాన్‌కు వాచ్‌మనే సూత్రధారిగా భావిస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.