పడవ ప్రమాదంలో 14 మంది మృతదేహాలు వెలికితీత..

నిన్న ఎనిమిది మృతదేహాలు వెలికితీసిన ఎన్డీఆర్ఎఫ్.. నేడు మరో ఆరుగురి మృతదేహాలను బయటికి తీశారు. పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి..

Update: 2022-03-01 10:00 GMT

ఝార్ఖండ్ : రాష్ట్రంలోని జామ్ తాడా జిల్లా బరాకర్ నదిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన 14 మంది మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. వాటన్నింటికీ పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం, మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మహిళలు ఉన్నట్లు జమ్తారా డిప్యూటీ కమిషనర్ ఫైజ్ అహ్మద్ ముంతాజ్ వెల్లడించారు. నిన్న ఎనిమిది మృతదేహాలు వెలికితీసిన ఎన్డీఆర్ఎఫ్.. నేడు మరో ఆరుగురి మృతదేహాలను బయటికి తీశారు. పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు.

ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు జామ్ తాడా నుంచి నిర్సాకు బరాకర్ నదిలో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. బలమైన ఈదురుగాలులు, తుపాను.. పడవ ప్రమాదానికి ప్రధాన కారణాలని అధికారులు చెప్తున్నారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 18 మంది ఉండగా నలుగురు ఎలాగొలా ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా 14 మంది నదిలో గల్లంతవ్వగా.. వారికోసం పట్నా, రాంచీ ఎన్డీఆర్ఎఫ్​బృందాలు గాలింపు చేపట్టాయి. నదిలో గల్లంతైన వారి మృతదేహాలను బయటికి తీసేందుకు సుమారు ఐదురోజుల సమయం పట్టింది. నదిపై బార్బెండియా బ్రిడ్జి పనిచేస్తే ప్రమాదాన్ని నివారించవచ్చని పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News