రైలు నుంచి జారిపడి కొత్త దంపతులు మృతి

రైలు నుంచి జారిపడి కొత్త దంపతులు మరణించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

Update: 2025-12-20 05:00 GMT

రైలు నుంచి జారిపడి కొత్త దంపతులు మరణించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. జిల్లాలోని వంగపల్లి - ఆలేరు రైలు మార్గంలో పార్వతీపురం మన్యం జిల్లాకుచెందిన కోరాడ సింహాచలం, భవానీలకు వివాహమయింది. ఇద్దరూ హైదరాబాద్ లో ఒక ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నారు. జగద్గిరిగుట్టలోని గాంధీనగర్ లో వారు నివాసం ఉంటున్నారు.

విజయవాడ వెళుతూ...
విజయవాడలోని తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ను ఎక్కారు. రైతుల వంగపల్లి దాటిన తర్వాత డోర్ వద్ద నిలబడి ఉన్న ఇద్దరూ కిందకు జారిపడి మరణించారు. అయితే మృతదేహాలను గమనించిన ట్రాక్ మెన్ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం చేసిన తర్వాత వారి బంధువులకు అప్పగించారు.


Tags:    

Similar News