నెల్లూరు జిల్లాలో అత్తా మామల హత్య

నెల్లూరు జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. అత్తమామలను అల్లుడు చంపిన ఘటన వెలుగు చూసింది.

Update: 2025-06-30 04:21 GMT

నెల్లూరు జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. అత్తమామలను అల్లుడు చంపిన ఘటన వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎస్టీ కాలనీలో ఘటన జరిగింది. కత్తితో నరకడంతో అత్త, మామలు అక్కడికక్కడే మరణించారు. అల్లుడి దాడిలో మరణించిన వారు జయమ్మ, కల్లయ్య లుగా పోలీసులు గుర్తించారు.భార్యపై కత్తితో దాడి చేస్తుండగా అత్తమామలు అడ్డుకోవడంతో వెంగయ్య వారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

అల్లుడు పరారీ...
హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కుటుంబంలో తలెత్తిన విభేదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాధమికంంగా నిర్ధారించారు ఘటన తర్వాత నిందితుడు వెంగయ్య పరారయ్యాడు. పోలీసులు వెంగయ్య కోసం వెదుకుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News