డిజిటల్ అరెస్ట్ పేరుతో 80 లక్షలకు టోకరా

డిజిటల్‌ అరెస్టు పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును నిందితులు మోసగించి ఎనభై లక్షల రూపాయల నగదు తీసుకున్న సంఘటన బెంగళూరులో జరిగింది

Update: 2025-04-22 03:06 GMT

కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా ఇంకా మోసపోయేవారికి మాత్రం తక్కువ లేదు. ప్రతి రోజూ టీవీల్లోనూ, పత్రికల్లోనూ డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫేక్ కాల్స్ వస్తున్నాయని, వాటిని నమ్మవద్దంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసినా వాటిని పట్టించుకోకుండా నమ్మేసి మోసపోయే వారి సంఖ్య ఇంకా ఉన్నట్లుగానే అనిపిస్తుంది. తాజాగా డిజిటల్‌ అరెస్టు పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును నిందితులు మోసగించి ఎనభై లక్షల రూపాయల నగదు తీసుకున్న సంఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.

బెంగళూరులో ఘటన...
వైట్‌ఫీల్డ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కొద్ది రోజుల కిందట ఓవ్యక్తి ఆర్‌బీఐ అధికారి పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుకు ఫోన్‌చేసి బ్యాంకు ఖాతాలోకి అక్రమంగా నగదు జమ అయిందని, అందుకు అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు నుంచి తప్పించేందుకు తాము సూచించిన ఖాతాలోకి నగదు జమ చేయాలని నిందితులు సూచించారు. దశల వారీగా నగదు తీసుకున్న మోసగాళ్లు అనంతరం ఫోన్, బ్యాంకు ఖాతా పని చేయకుండా చేశారు.
మోసపోయిన టెకీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News