100 కోట్లు దాటిన ఈఈ అక్రమాస్తులు
చొప్పదండి డివిజన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
చొప్పదండి డివిజన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో 100 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని సమాచారం. శ్రీధర్ తో పాటు అతని బంధువులు, సన్నిహితులకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో 13 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
కరీంనగర్‌లో శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన గాయత్రి పంప్‌హౌస్ బాధ్యతలను శ్రీధర్ చూసేవారని, అక్కడ ఏర్పాటు చేసిన భారీ మోటార్ల కొనుగోళ్లలో ఆయన కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. మలక్‌పేటలో నివసిస్తున్న శ్రీధర్ మార్చి 6న తన కుమారుడి వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ లో థాయ్‌లాండ్‌లో అత్యంత ఘనంగా నిర్వహించారు.