Afghanistan blasts: కాబూల్ ప్రాంతంలో పేలుళ్లు.. ఇద్దరు మృతి
ఆప్ఘనిస్థాన్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల కారణంగా ఇద్దరు మరణించగా పథ్నాలుగు మంది గాయాల పాలయ్యారు
huge explosion occurred in afghanistan
Afghanistan blasts:ఆప్ఘనిస్థాన్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల కారణంగా ఇద్దరు మరణించగా పథ్నాలుగు మంది గాయాల పాలయ్యారు. కాబూల్ పశ్చిమ ప్రాంతంలోని డష్ట్ ఎ బర్చి ప్రాంతంలోని బస్సులో ఈ భారీ పేలుడు సంభవించింది. వెంటనే సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మరెక్కడైనా బాంబులున్నాయేయోనన్న ఆందోళన వ్యక్తం అవుతుండటంతో బాంబ్ స్క్కాడ్‌లతో పరిశీలిస్తున్నారు.
బస్సులో పేలుడు...
పేలుడు జరిగిన సమయంలో పదుల సంఖ్యలో బస్సులో ప్రయాణికులున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఆప్ఘనిస్థాన్ లో పేలుళ్లకు కారణం అనేది ఇంకా తెలియరాలేదు. తాలిబాన్ యంత్రాంగం కూడా ఇంత వరకూ అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఎవరు ఈ పేలుళ్లకు కుట్ర పన్నారన్న విషయంపై స్పష్టత రాలేదు. గాయపడిన వారిని ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు.