13 కేసుల్లో నిందితుడు.. 20 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతూనే ఉండేవాడు

నిందితుడు 40 ఏళ్ల దిల్షాద్ చిన్న వయసులోనే చెడు సావాసాలు చేశాడు. కొందరు ఆకతాయిలతో తిరిగి

Update: 2022-08-13 04:53 GMT

కొందరు పలు కేసులలో నిందితులైనప్పటికీ పోలీసులకు ఏ మాత్రం చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు. చాలా మంది కొన్ని ఏళ్లుగా కూడా పోలీసులకు పట్టుబడరు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 సంవత్సరాల పాటూ అతడు పోలీసులకు పట్టుబడకుండా బతికాడు. కానీ ఎట్టకేలకు పోలీసుల వలలో పడ్డాడు. 13 కేసుల్లో నిందితుడైన సదరు వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. ఢిల్లీ పోలీసులు గత 20 సంవత్సరాలుగా పట్టుబడకుండా తప్పించుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 13 కేసులు ఉన్న హిస్టరీ-షీటర్‌ను అరెస్టు చేశారు. రహస్య సమాచారం ఆధారంగా నిందితుడు దిల్షాద్ అలియాస్ లాల్‌చంద్‌ను ఢిల్లీలోని సుల్తాన్‌పురి బస్ టెర్మినల్ నుండి పట్టుకున్నారు.

నిందితుడు 40 ఏళ్ల దిల్షాద్ చిన్న వయసులోనే చెడు సావాసాలు చేశాడు. కొందరు ఆకతాయిలతో తిరిగి రౌడీయిజం వైపు దృష్టి పెట్టాడు. ఆ తర్వాత గొడవలు.. పలు నేరాలు.. ఇలా అతడు యువకుడిలా ఉన్న సమయంలో ముందుకు సాగింది. అతను చెడు సహవాసంలో తిరుగుతూ.. మాదకద్రవ్యాల అలవాటు కూడా చేసుకున్నాడు. పలు నేరాలు చేయడం ప్రారంభించాడని విచారణలో అంగీకరించాడు.
1999లో అతను తన సహచరులతో కలిసి ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతంలో దోపిడీకి పాల్పడ్డాడు. ట్రక్కు నుండి 23 కార్టన్‌ల ఇంజన్ ఆయిల్‌ను దొంగిలించాడు. చోరీ సొత్తుతో పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుడు కోర్టు బెయిల్‌పై ఉన్నాడు. అరెస్టు నుండి తప్పించుకోవడానికి, అతను తన ఇంటిని అమ్మేసి వేర్వేరు ప్రాంతాలలో నివసించడం ప్రారంభించాడు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 13 దోపిడీ, దొంగతనం, ఆయుధాల చట్టం, ఎన్‌డిపిఎస్ చట్టం వంటి 13 కేసుల్లో అతడికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.


Tags:    

Similar News