Sheethal : ఇద్దరికీ పెళ్లయింది.. శీతల్ హత్యకు అదే కారణం.. మద్యం తాగిన తర్వాత?

హర్యానా మోడల్ శీతల్ మర్డర్ మిస్టరీ వీడింది. శీతల్ ను ఆమె ప్రియుడు సునీల్ చంపేశాడన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు

Update: 2025-06-18 05:34 GMT

Sheethal

హర్యానా మోడల్ శీతల్ మర్డర్ మిస్టరీ వీడింది. శీతల్ ను ఆమె ప్రియుడు చంపేశాడన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. శీతల్ ను పెళ్లి చేసుకోవాలని వత్తిడి తీసుకు రావడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. ఆమె ప్రియుడు సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరికీ పెళ్లయింది.శీతల్ కు పెళ్లయి భర్త ఒక బిడ్డ ఉండగా, ఆమె ప్రియుడు సునీల్ కు పెళ్లయి భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి చేసుకోవాలన్న బలవంతం చేసినంుదుకే సునీల్ శీతల్ చౌదరిని హతమార్చారని చెబుతున్నారు.

ప్లాన్ పక్కాగానే...
శీతల్ ను హత్య చేసి మృతదేహాన్ని కారులో పడేసి కారుతో పాటు కాల్వలోకి తోసేస్తే అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించవచ్చని సునీల్ ప్లాన్ వేశాడు. అయితే సునీల్ ప్లాన్ వికటించింది. అంతకు ముందు ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో పాటు శీతల్ మెడపై బలమైన గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను ఎవరో హత్య చేశారని భావించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. శీతల్, సునీల్ గతంలో ఒక హోటల్ లో పనిచేసేవారు. ఇద్దరికీ అక్కడే పరిచయమయింది. ఇద్దరికీ వివాహయినా ఆరేళ్లు గా తమ వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారు.
భర్తను వదిలేసి రావాలంటూ...
అయితే సునీల్ గత కొంతకాలంగా భర్తను వదిలేసి తన వద్దకు రావాలని బలవంతం చేస్తున్నాడు. అయితే అప్పటికే శీతల్ కు పెళ్లి కావడం, ఐదు నెలలబిడ్డ ఉండటంతో వారిని వదిలి రాలానని, ఈ సంబంధం ఇలాగే కొనసాగిద్దామని నచ్చ చెప్పింది. అందుకు అంగీకరించినట్లే నటించిన సునీల్ ఆమెను నమ్మించి బయటకు తీసుకెళ్లి హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఆల్బమ్ షూటింగ్ కోసం పానిపటగ్ లోని అహార్ గ్రామానికి వెళ్లిన శీతల్ వద్దకు వచ్చిన సునీల్ ఆమెతో కలిసి మద్యం తాగాడు. తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. శీతల్ పై చేయి చేసుకున్నాడు. ఈ విషయాన్ని తన శీతల్ తన సోదరికి చెప్పింది. ఫిబ్రవరి 14వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించిన పోలీసులు సునీల్ ను అరెస్ట్ చేశారు. శీతల్ ను హత్య చేసిన తర్వాత సునీల్ గాయాలతో ఆసుపత్రిలో చేరడంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారించి అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News