నాకు బెయిల్ వద్దు.. లాయర్ వద్దు అంటూ జైలుకు

మీర్ పేట్ లో తన భార్య మాధవిని హత్య చేసిన గురుమూర్తిని పోలీసులు రిమాండ్ కు తరలించారు

Update: 2025-01-29 11:47 GMT

మీర్ పేట్ లో తన భార్య మాధవిని హత్య చేసిన గురుమూర్తిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే ఈరోజు గురుమూర్తిని న్యాయస్థానంలో హాజరుపర్చగా తనకు బెయిల్ వద్దని, న్యాయవాది కూడా వద్దు అని ఆయన అన్నారు. మాధవిని అతి కిరాతకంగా చంపిన గురుమూర్తిని నిందితుడిగా నిర్ధారించి నిన్న ఆయన ఇంటికి తీసుకెళ్లిన పోలీసులు రీ కనస్ట్రక్షన్ కూడా చేశారు.

కిరాతకంగా చంపిన...
భార్యతో గొడవపడి ఆమెను హత్య చేయడానికి ఒక పథకం ప్రకారం ఆనవాళ్లను నాశనం చేసిన గురుమూర్తిని శాస్త్రీయ ఆధారాలతో పట్టుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. గురుమూర్తిలో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదని పోలీసు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన గురుమూర్తికి న్యాయమూర్తి పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు.


Tags:    

Similar News