భార్య మందలించిందన్న మనస్తాపంతో జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య

అల్వాల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జొన్నబండలో భార్య, పిల్లలతో నివసించే అంజయ్య(32) జీహెచ్ఎంసీలో చెత్తతరలింపు

Update: 2022-02-14 06:23 GMT

భార్య మందలించిందనో, భర్త కొట్టాడనో, ఇంట్లో గొడవలయ్యాయనో.. ఇలా చిన్న చిన్న కారణాలకు విలువైన జీవితాలను క్షణికావేశంలో బలవంతంగా ముగించుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య/భర్త, కడుపున పుట్టిన పిల్లల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. భార్య మందలించిందని మనస్తాపం చెందిన జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి అంజయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అల్వాల్ లోని జొన్నబండలో జరిగింది.

అల్వాల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జొన్నబండలో భార్య, పిల్లలతో నివసించే అంజయ్య(32) జీహెచ్ఎంసీలో చెత్తతరలింపు వాహనం డ్రైవర్ గా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం అంజయ్య తన తండ్రి, తమ్ముడి వద్ద కొంత అప్పు తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో.. అంజయ్య కుటుంబంలో మెల్లగా గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం కూడా వదిన లక్ష్మమ్మతో మరిది గొడవడ్డాడు. సాయంత్రం ఇంటికొచ్చిన భర్త అంజయ్యకు.. లక్ష్మమ్మ జరిగిన విషయం చెబుతూ.. ఇదంతా నీవల్లే అని అంజయ్యను గద్దించింది.
భార్య గొడవతో మనస్తాపం చెందిన అంజయ్య.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న అల్వాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అంజయ్య ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






Tags:    

Similar News